HomeOTTBhale Unnade సినిమాని ఓటిటిలో ఎప్పటినుండి చూడచ్చంటే

Bhale Unnade సినిమాని ఓటిటిలో ఎప్పటినుండి చూడచ్చంటే

Bhale Unnade locks its OTT release date
Bhale Unnade locks its OTT release date

Bhale Unnade OTT release date:

హీరో రాజ్ తరుణ్ నటించిన భలే ఉన్నాడే చిత్రం ఈమధ్యనే థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన జే. శివసాయీ వర్ధన్ కు ఇది తొలిచిత్రం. మనీషా కందుకూర్ హీరోయిన్ గా నటించిన, ఈ సినిమా అతి త్వరలో ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది.

ఈ చిత్రం అక్టోబర్ 3, 2024న ఈటీవీ విన్ (ETV Win) ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమ్ కానుంది. థియేటర్లలో ఈ చిత్రానికి పెద్దగా స్పందన లభించకపోయినప్పటికీ, ఇంట్లో సౌకర్యంగా చూడటానికి ప్రేక్షకులు ఎంతవరకు ఆసక్తి చూపిస్తారో చూడాలి. ముఖ్యంగా ఓటీటీలో సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్న ఈ సమయంలో ఈ సినిమాకు కూడా మంచి స్పందన వచ్చే అవకాశం ఉంది.

ఇక ఈ సినిమాలో సింగీతం శ్రీనివాస్, అభిరామి, సుదర్శన్, అమ్ము అభిరామి, హైపర్ ఆది, వీటీవీ గణేష్, లీలా శాంసన్ వంటి పేరున్న నటీనటులు కీలక పాత్రలలో కనిపించారు. ఈ సినిమాలో సంగీత దర్శకుడిగా శేఖర్ చంద్ర పనిచేశారు. ఇందులోని పాటలు కూడా వినసొంపుగా ఉంటాయి.

ఈ సినిమాని రవి కిరణ్ ఆర్ట్స్, మారుతీ టీమ్ నిర్మించారు. థియేటర్లలో ఏమాత్రం రాణించని ఈ చిత్రం ఓటీటీలో మంచి విజయాన్ని సాధిస్తుందో లేదో అని అక్టోబర్ 3న తెలుస్తుంది. బయట ఎన్ని వివాదాల్లో ఉన్న కూడా రాజ్ తరుణ్ మాత్రం వరుస సినిమాలతో అందరి దృష్టిని బాగానే ఆకర్షిస్తున్నాడు.

Read More: Devara ఓటిటి రిలీజ్ విషయంలో ట్విస్ట్ అదే

Recent Articles English

Gallery

Recent Articles Telugu