Bhagyashri Borse: మూవీ ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో హీరోయిన్ హవా నడుస్తుంది. మొన్నటి వరకూ శ్రీలీల ట్రెండ్ నడిచింది. ఆమెకు వరుస ఫ్లాప్‌లు ఎదురుకావడంతో..సినిమాలకు బ్రేక్ ఇచ్చి చదువుపై దృష్టి పెట్టింది. నిన్నటి వరకూ మృణాల్ ఠాకూర్ వరుస సినిమాతో బిజీగా ఉంది. ఇప్పటి వరకూ టాలీవుడ్‌లో 3 సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ. ది ఫ్యామిలీ స్టార్ సినిమాతో మొదటి సారిగా ఫ్లాప్‌ను చవి చూసింది. ప్రస్తుతం ఆమె సినిమాలు ఏవీ కన్ఫర్మ్ చేయలేదు.
తాజాగా భాగ్యశ్రీ బోర్సే పేరు టాలీవుడ్‌లో గట్టిగా వినిపిస్తుంది. భాగ్యశ్రీ బోర్సే మహారాష్ట్ర పుణేలో పుట్టి పెరిగింది. హిందీ చిత్రం యారియాన్ 2తో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది ఈ బ్యూటీ. అంతకుముందు పలు యాడ్స్‌లో మోడల్‌గా పని చేసింది. క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ యాడ్‌తో ఈ బ్యూటీ ఎక్కువగా ఫేమస్ అయింది. యారియాన్ 2లో ఈ బ్యూటీ యాక్టింగ్‌కి ఫిదా అయి డైరెక్టర్ హరీశ్ శంకర్ మిస్టర్ బచ్చన్‌లో అవకాశం ఇచ్చారు. సోషల్ మీడియాలో అయితే ఈ బ్యూటీకి ఫుల్ ఫాలోయింగ్ ఉంది.
హరీష్ శంకర్ డైరెక్షన్‌లో రవితేజ నటిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది ఈ సుందరి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడుకి వరుసగా భారీ ఆఫర్లు వస్తున్నట్లు టాక్. ఇందులో ఒకటి గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో వస్తున్న సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. ఇక విజయ్ దేవరకొండ సినిమాలో కూడా ఈ బ్యూటీ దాదాపు ఖాయం అయినట్లే కనిపిస్తుంది. మరో పక్క ప్రేమలు హీరోయిన్ అయితే బాగుటుంది అనే ఆలోచనలో ఉన్నారంట.
ఇక తాజాగా మరొక క్రేజీ ఆఫర్ కూడా వచ్చినట్లు తెలుస్తుంది. నేచురల్ స్టార్ నాని హీరోగా- సుజీత్ దర్శకత్వంలో ఇటీవలే ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈమూవీలో భాగ్యశ్రీ బోర్సేను హీరోయిన్‌గా తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ బ్యూటీ నాని-సుజీత్ సినిమాలో ఛాన్స్ దక్కించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం నాని వరుస హిట్లుతో దూసుకుపోతున్నారు.
దసరా సినిమాతో రూ.100 కోట్లు కొల్లగొట్టిన నాని ఆ తర్వాత హాయ్ నాన్నతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు సరిపోదా శనివారం చిత్రంతో ఆడియన్స్‌ను పలకరించబోతున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ట్రైలర్‌కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి టాలీవుడ్‌లో ఏ రేంజ్‌లో ఈ భామ హిట్ అందుకుంటుందో చూడాలి. మిస్టర్ బచ్చన్, విజయ్ దేవరకొండ, నాని ఇలా ముగ్గురు స్టార్ హీరోలతో వరుస అవకాశాలు అంటే భాగ్యశ్రీ లక్ అనే చెప్పాలి.