నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘భగవంత్ కేసరి’. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. టాలీవుడ్ క్రేజీబ్యూటీ శ్రీలీల కీలక పాత్రలో నటించింది. అక్టోబర్ 19న రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
ఇప్పటి వరుకూ ప్రపంచ వ్యాప్తంగా రూ. 130 కోట్లకు పైగా గ్రాస్ ను సాధించింది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తిక వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఈ నెల 23న ఓటీటీలోకి వస్తోందనేదే టాక్. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోందని అంటున్నారు.
అయితే దీనిపై అధికారికంగా రావాల్సి ఉంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ పాత్రలో నటించారు. శరత్ కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటించాడు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.