నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘భగవంత్ కేసరి’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈమూవీ ఫస్ట్ సింగిల్ ప్రోమోను రేపు సాయంత్రం 4:05 గంటలకు లాంచ్ చేస్తున్నట్టు తెలియజేస్తూ.. శ్రీలీల, బాలయ్య డ్యాన్స్ లుక్‌ను విడుదల చేశారు. సిల్వర్ స్క్రీన్‌పై ఈ ఇద్దరి డ్యాన్స్ ఏ రేంజ్‌లో ఉండబోతుందోనని క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు సినీ జనాలు. థమన్ కంపోజిషన్‌లో వస్తున్న ఈ పాటపై మ్యూజిక్ లవర్స్‌లో అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఇప్పటికే గ్లింప్స్‌కి మంచి స్పందన వచ్చింది. భగవంత్ కేసరి మూవీ చిత్రాన్ని ఓవర్సీస్‌లో పాపులర్ లీడింగ్ డిస్ట్రిబ్యూషన్ హౌజ్ సరిగమ సినిమాస్ విడుదల చేయనుంది. అక్టోబర్ 18న యూఎస్‌ఏలో గ్రాండ్‌గా ప్రీమియర్స్ ఉండబోతున్నాయి. అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలకు గూస్ బంప్స్ తెప్పించే బీజీఎం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన ఎస్ థమన్ మరోసారి సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.

#GaneshAnthem will bring the celebratory atmosphere early ❤️🔥

Promo out tomorrow at 4.05 PM💥💥
Full song on September 1st💥💥#BhagavanthKesari pic.twitter.com/NesPPy0Yew
— Shine Screens (@Shine_Screens) August 29, 2023