HomeTelugu Trending'భగవంత్‌ కేసరి' స్పెషల్‌ పోస్టర్‌

‘భగవంత్‌ కేసరి’ స్పెషల్‌ పోస్టర్‌

bhagavanth kesari movie spe

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భగవంత్ కేసరి. ఎన్‌బీకే 108గా వస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల పోస్టర్‌లతో పాటు టీజ‌ర్‌, పాటలకు మంచి స్పందన వచ్చింది. తాజాగా వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా స్పెషల్‌ పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు.

వినాయక చవితి పండుగ కానుకగా గ‌ణేష్ పాట‌కు డ్యాన్స్ చేస్తున్న పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇక ఎప్పుడు యాక్షన్‌ మోడ్‌లో ఉండే బాల‌య్య‌ ఇందులో భ‌క్తి మోడ్‌లో కనిపిస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 19న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది.

టాలీవుడ్‌ వాటెండ్‌ బ్యూటీ శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు. బాలీవుడ్ న‌టుడు అర్జున్‌ రాంపాల్‌తో పాటు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu