నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో శ్రీ లీల, కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ మూవీలో అర్జున్ రాంపాల్ విలన్. థమన్ సంగీతం అందిస్తున్నారు.
భగవంత్ కేసరి మూవీని ఈ ఏడాది అక్టోబర్ 19న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలకు భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా బాలయ్య మూవీకి సంబందించిన ఫస్ట్ సింగిల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను మేకర్స్ ప్రకటించారు.
భగవంత్ కేసరి మూవీకి సంబందించిన ఫస్ట్ సింగిల్ ప్రకటన రేపు సాయంత్రం 4:05 గంటలకు రానుంది. ఈవిషయాన్ని మేకర్స్ స్వయంగా సెట్స్‌లో నుండి ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈసారి మోత మోగిపోయే అప్డేట్‌తో వస్తున్నామంటూ వీడియోను పోస్ట్ చేశారు.
గీసారి మోత మోగిపోయే అప్డేట్ తో ఒస్తున్నం 😎#BhagavanthKesari First Single Announcement Tomorrow at 4:05 PM❤️🔥
Keep your expectations sky-high 🔥
A @MusicThaman Musical 🥁#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @JungleeMusicSTH @rampalarjun… pic.twitter.com/zBYuzcsScf
— Shine Screens (@Shine_Screens) August 23, 2023