యువి క్రియేషన్స్ సంస్థ ఏ ముహూర్తాన ‘భాగమతి’ సినిమాను మొదలుపెట్టిందో కానీ ఇప్పటివరకు సినిమా విడుదల కాలేదు. రెండేళ్ళ క్రితం మొదలుపెట్టిన సినిమా ఇదిగో రిలీజ్ డేట్ అంటున్నారే కానీ సినిమా మాత్రం ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. దాదాపు ముప్పై కోట్లకు పైగా ఈ సినిమాపై పెట్టుబడి పెట్టారు. డైరెక్టర్ కు పెద్దగా క్రేజ్ లేదు. అనుష్క, యువి క్రియేషన్స్ తప్ప సినిమాలో చెప్పుకోవడానికి మరో ఎలిమెంట్ లేదు. గ్రాఫిక్ వర్క్ పూర్తి చేసి డిసంబర్ మూడవ వారంలో సినిమాను విడుదల చేస్తారని మాటలు వినిపించాయి.
కానీ అదే నెలలో రాబోతున్న అఖిల్ ‘హలో’ సినిమా కోసం మళ్ళీ రిలీజ్ డేట్ ను వాయిదా వేసి సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు సినిమా సంక్రాంతికి రావడం లేదని సమాచారం. ఇటీవలే సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి పబ్లిసిటీ ముమ్మరం చేయడంతో సినిమా టైం కి వచ్చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ సినిమా ప్రీసమ్మర్ కు విడుదల చేయబోతున్నారట.