HomeUncategorizedఏపీలో రగులుతున్న రాజకీయ వేడి.. వైసీపీ, బీజేపీ మధ్య ట్విట్టర్ వార్

ఏపీలో రగులుతున్న రాజకీయ వేడి.. వైసీపీ, బీజేపీ మధ్య ట్విట్టర్ వార్

12 15

ఆంధ్రప్రదేశ్ లో ఓ వైపు కరోనా మహమ్మారి బుసలు కొడుతుంటే.. మరోవైపు రాజకీయ వేడి రగులుతోంది. కరోనా కష్టాల నుంచి ప్రజలు ఎప్పుడు బయటపడతామా అని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వైసీపీ సీనియర్ నేత ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కన్నా లక్ష్మీనారాయణ రూ. 20 కోట్లకు అమ్ముడు పోయారని సుజనా
ద్వారా డీల్ జరిగిందని ఆరోపించారు. ఇంతకాలం కామ్‌గా ఉన్న నాయకులు ఇప్పుడు ట్విట్ల యుద్ధానికి దిగారు.

విజయసాయి రెడ్డి ఆరోపణలను ఏపి బీజేపీ తిప్పికొడుతూ ట్విట్టర్‌లో ఘాటుగా రిప్లై ఇచ్చింది. “సూట్ కేస్ రెడ్డి ,బహుకాలపు జైలు పక్షివి..రాజకీయాల్లో అక్కుపక్షివి.. వైసీపీ అవినీతి మురికి గుంటలో బుడగవి.. ప్రచారం కోసం పైత్యం రాతలు రాసుకునే 5రూ ఆర్టిస్ట్ వి.. మీ బ్రతుకు అంతా కేసులు-సూట్ కేసులే.. మీ పరిధిలో మీరు ఉండి చీకట్లో చిల్లర లెక్కలు చూసుకోండి. పాపం పండే టైం వచ్చేసింది.” అంటూ ట్వీట్ చేసింది ఏపీ బీజేపీ. ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి .

Recent Articles English

Gallery

Recent Articles Telugu