విజయ్ ఆంటోని’ కధానాయకునిగా తమిళంలో రూపొందుతున్న ‘సైతాన్’ చిత్రం తెలుగు నాట ‘బేతాళుడు’ గా డిసెంబర్ 1 పలకరించబోతోంది.
తెలుగు,తమిళంలో చిత్రం డిసెంబర్ 1 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి అని తెలిపారు నిర్మాత ఎస్.వేణుగోపాల్. ‘మానస్ రిషి ఎంటర్ ప్రైజస్’ సంస్థ తో కలసి ఈ ‘బేతాళుడు’ చిత్రాన్నితెలుగునాట తమ ‘విన్.విన్.విన్. క్రియేషన్స్’ సంస్థ విడుదల చేయనుందని నిర్మాత ఎస్.వేణుగోపాల్ తెలిపారు.
ఇటీవల యూ ట్యూబ్ లో బేతాళుడు చిత్రానికి సంబంధించి మొదటి 10 నిమిషాల చిత్రాన్ని విడుదల చేయటం జరిగింది. తెలుగు,తమిళ భాషల్లో ఇలా విడుదల చేయగా ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన స్పందన చిత్రం విజయం పై మానమ్మకాన్ని మరింత పెంచాయని తెలిపారు చిత్ర నిర్మాతలు. అలాగే ఇటీవల విడుదల అయిన చిత్రం ఆడియో కు మంచి స్పందన లభించిందని అన్నారు.
చిత్ర కథానాయకుడు ‘విజయ్ ఆంటోని’ మాట్లాడుతూ..’ నటునిగా వైవిధ్యమైన పాత్రల పోషణ లక్ష్యం గా ఉన్న నాకు కొనసాగింపు ఈ ‘బేతాళుడు’. ‘సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్’ ఈ చిత్రం. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఈ చిత్రంలో నా పాత్ర గత చిత్రాలకు పూర్తి భిన్నమైనదిగా ఉండటంతో పాటు, వైవిధ్యాన్ని సంతరించుకుని ఉంటుంది.చిత్ర దర్శకుడు ‘ప్రదీప్ కుమార్’ ఈ చిత్రం ప్రేక్షకులను పూర్తిస్థాయిలో అలరించేలా తీర్చి దిద్దారని నమ్ముతున్నాను. ‘ప్రదీప్ కలపురయల్’ సినిమాటోగ్రఫీ ఓ ఎస్సెట్ ఈ చిత్రానికి. ‘బేతాళుడు’ కు సంగీతం నేనే. పాటలు,నేపధ్య సంగీతం సంగీత ప్రియులను అలరించటం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు.
ఇటీవల యూ ట్యూబ్ లో ఉంచిన తొలి 10 నిమిషాల చిత్రానికి వచ్చిన స్పదన ఎంతో సంతోషా న్నిచ్చిందని తెలిపారు విజయ్ ఆంటోని. ‘బిచ్చగాడు’ విజయం తరువాత విడుదల అవుతున్న’బేతాళుడు’ చిత్రం పై సహజంగా అంచనాలు అధికంగానే ఉంటాయి. వాటికి తగిన స్థాయిలోనే ఈ చిత్రం ఉంటుందని తెలిపారు చిత్ర కథానాయకుడు విజయ్ ఆంటోని.