టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ న్యూలుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పొడవు జుట్టు.. కోర మీసం.. గుబురు గడ్డం తో హాలీవుడ్ హీరోలను తలపిస్తున్నాడు. ఇప్పటి వరకు హీరోగా సరైన సక్సెస్ కోసం చూస్తున్నాడు బెల్లంకొండ. దానికోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. అల్లుడ శీను పర్వలేదని అనిపించినా.. ఆ తర్వాత చేసిన సినిమాలు అంచనాలు అందుకోలేదు. ‘రాక్షసుడు’ మాత్రం పర్లేదనిపించింది. ఇక తాజాగా ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అల్లుడు అదుర్స్’ సినిమాతో వస్తున్నాడు. ఈ చిత్రంలో నభా నటేష్, అనూ ఇమాన్యుయేల్ బెల్లంకొండకు జంటగా నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని సంక్రాంతి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక బెల్లంకొండ లేటెస్ట్ ట్రెండీ ఫోటోషూట్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
Thanks for this amazing concept and shoot #adrinsequeira #naveedahme pic.twitter.com/r9aWFrWcKM
— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) November 9, 2020