యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న సినిమా ‘రాక్షసుడు’. రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వం వహిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. తమిళ సినిమా ‘రాక్షసన్’ కు తెలుగు రీమేక్ ఇది.
శనివారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో ఓ సైకో వరుస హత్యలు చేస్తూ ప్రజల్ని భయపెడుతూ కనిపించాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ‘సింపుల్‌గా చెప్పాలంటే.. వాడో సైకో.. వాడికి నొప్పి అంటే ఏంటో తెలియదనుకుంటా. రాక్షసుడు..’ అని ఓ వైద్యుడు బెల్లంకొండకు విలన్ స్వభావం వివరిస్తున్న ఈ టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. జులై 18న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు