Bellamkonda Sai Sreenivas
బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఇండస్ట్రీ లోకి ఒక స్టార్ కిడ్ గా అడుగుపెట్టిన మాట వాస్తవమే. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ పెద్ద కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కానీ కొంతకాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినా తన నటనతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీ లో నటుడిగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జర్నీ నిజంగా చాలా మందికి స్ఫూర్తిని ఇస్తుంది అని చెప్పుకోవచ్చు.
తండ్రి నిర్మాత కావడంతో చిన్నప్పటినుండి సినిమాలను, సినిమా షూటింగ్ లను.. దగ్గర నుండి చూసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. నటన మీద ఆసక్తితో లాస్ ఏంజిల్స్ లోని లీ స్ట్రాస్బెర్గ్ థియేటర్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్, ముంబైలోని బారీ జాన్ యాక్టింగ్ స్టూడియోలో శిక్షణ తీసుకున్నారు. ట్రైనింగ్ తర్వాత హీరోగా తన కెరియర్ ను ప్రారంభించారు. వియత్నాంలో మార్షల్ ఆర్ట్స్, స్టంట్స్ కూడా నేర్చుకోవడం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి బాగా ఉపయోగపడింది.
ఈ దశాబ్ద కాలంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. 2014లో సమంత హీరోయిన్ గా “అల్లుడు శీను” అనే సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. మొదటి సినిమా అయినప్పటికీ, కమర్షియల్ గా ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత స్పీడున్నోడు, జయ జానకి నాయక, సాక్ష్యం, కవచం, సీత, రాక్షసుడు, అల్లుడు అదుర్స్ వంటి సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.
As I mark 10 unforgettable years in the film industry, I’m overwhelmed with gratitude for all the amazing fans and audiences who have stood by me through thick and thin. Your unwavering support has been my greatest strength.
To honor this milestone, I’m dedicating this special… pic.twitter.com/BxPyvAWpoW
— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) July 25, 2024
ఈ మధ్యనే చత్రపతి సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టారు. ఇప్పుడు శ్రీనివాస్ చేతుల్లో చాలానే ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. మొదటగా 14 రీల్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై టైసన్ నాయుడు తో, సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో, కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో కూడా మరో సినిమాని ఈ మధ్యనే అధికారికంగా ప్రకటించారు. మూన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ పై లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నారు. ఇవే కాకుండా, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ప్రకటించనున్నారు.
ఇక సినిమాల పరంగా పక్కన పెడితే, ఈ పదేళ్లలో బెల్లంకొండ శ్రీనివాస్ ఒక్క వివాదంలో కూడా ఇరుక్కోకపోవడం విశేషం. వివాదాలకు దూరంగా ఉండటం ఆయన నైజం. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా శ్రీనివాస్ చాలా సాదాసీదాగా ఉంటారు. అదే ప్రేక్షకులను ఇంకా ఎక్కువగా ఆకట్టుకుంటుంది. సినీ పరిశ్రమలో ఆయన ప్రయాణం ఇంకా చాలా కాలం విజయవంతంగా కొనసాగాలని, ఎన్నో హిట్ సినిమాలు అందుకుంటూ కెరియర్ లో ముందుకు దూసుకువెళ్లాలని అభిమానులు ఆశిస్తున్నారు.