Begumpet robbery video viral: బేగంపేట.. జైన్ కాలనీలో నివాసం ఉంటున్న ఒక ఇంటికి కి డెలివరీ బాయ్స్ వచ్చారు. ఆ సమయంలో యాజమాని ఇంట్లో లేడు. ఆయన భార్య అమిత, కుమార్తె, పనిమనుషులు ఉన్నారు. మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో తల్లి, కూతురు, పనిమనిషి ఇంట్లో ఉన్న సమయంలో ఇద్దరు యువకులు నేరుగా కొరియర్ అంటూ ప్రధాన గేటు నుంచి లోపలకు వచ్చారు.
గుమ్మం బయటే ఉండాలని ఆ మహిళ సూచిస్తుండగానే ఇద్దరిలో ఓ వ్యక్తి నేరుగా ఇంట్లోకి చొరబడ్డాడు. హెల్మెట్ ధరించి ఉన్న వ్యక్తి నాటు తుపాకీని ఆమెకు గురిపెట్టాడు. ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు ఇవ్వాలని బెదిరించారు. అయితే.. హెల్మెట్ ధరించి తుపాకీ గురిపెట్టిన వ్యక్తిని కాలితో తన్నిన అమిత, అతనితో కలబడింది. తలుపు బయటకు నెట్టుకుంటూ వచ్చి, అతనితో కలబడింది.
తల్లికి సాయంగా అమిత కుమార్తె కూడా నిందితుడితో పెనుగులాటకు దిగింది. ఈ క్రమంలో నిందితుడి చేతిలో ఉన్న నాటు తుపాకీని గుంజుకుంది. పెనుగులాటలో నిందితుడు ధరించిన హెల్మెట్ పడిపోయింది. ఆ సమయంలో అతను గతంలో తమ ఇంట్లో పని చేసిన వ్యక్తిగా గుర్తించారు. యూపీకి చెందిన సుశీల్‌కుమార్‌గా పేర్కొన్నారు. అతనితో పాటు వచ్చిన మరో నిందితుడు ప్రేమ్ చంద్ వంట గదిలో ఉన్న పనిమనిషిని కత్తితో బెదిరించాడు. సుశీల్‌కుమార్‌తో పెనుగులాడుతున్న సమయంలో మరో మార్గంలో పారిపోయేందుకు ప్రయత్నించాడు.
బాధితులు వీధిలోకి వెళ్లి కేకలు వేశారు. ఇరుగు పొరుగు వారితో కలిసి లోపలకు వస్తున్న క్రమంలో వారిని నెట్టుకుంటూ బయటకు పారిపోయాడు. ప్రధాన ద్వారం నుంచి బయటకు పరుగులు తీస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. బాధితురాలు అమిత ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలసులు ప్రేమ్‌చంద్‌ను అదుపులోకి తీసుకున్నారు. తల్లీ కూతుళ్ల సాహసం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Mother and daughter fight with a thief who entered their house with a gun and successfully manage to get rid of him and save themselves.
This incident took place in #Begumpet pic.twitter.com/JcbDuiY7Oq
— KLAPBOARD (@klapboardpost) March 22, 2024