కరోనా విజృంభిస్తున్న నేపద్యంలో దేశం మొతం లాక్డౌన్లో ఉంది. ఈ సమయంలో ఇంటికే పరిమితమై.. తమ అభిమాన సిరీయల్స్, రియాల్టీ షోలు లేకపోవడంతో బోర్‌గా ఫీల్ అవుతున్న ఎందరో వీక్షకుల కోసం తాజాగా హాట్ యాంకర్ శ్రీముఖి ‘బతుకు బలైపోయిన బండి’ అనే ఫన్నీ స్ఫూప్ను రూపొందించింది. ఈ స్ఫూప్లో ‘జబర్దస్త్’ అవినాష్, బుల్లితెర వ్యాఖ్యాత విష్ణుప్రియ భార్యాభర్తలుగా కనిపించగా.. వారిద్దరి మధ్య సమస్యను తీర్చే పెద్దగా శ్రీముఖి మెప్పించింది.
కరోనా వైరస్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితం కావడం వల్ల భార్యాభర్తలకు వచ్చే గొడవలను చాలా సరదాగా చెబుతూనే.. ఇద్దరు కలిసి పనులు పంచుకుంటే ఎలాంటి తగాదాలు, సమస్యలు రావనే మంచి మెస్సేజ్‌తో రూపొందించిన ఈ వీడియోను శ్రీముఖి, విష్ణుప్రియ, అవినాష్ ఎవరి ఇళ్లలో వాళ్లు ఉండి రూపొందించారు. ఈ వీడియోను శ్రీముఖి తన సోషల్‌మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ‘బతుకు బలైపోయిన బండి’ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు పలు కామెంట్లు పెడుతున్నారు.