మంగళవారం దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు మూతపడనున్నాయి. ప్రభుత్వ బ్యాంక్‌ల విలీనాలను నిరసిస్తూ బంద్‌లో పాల్గొనాల్సిందిగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ల యూనియన్లు పిలుపునిచ్చాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీ అసోసియేషన్(ఏఐబీఈఏ), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఈఎఫ్‌ఐ), ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఏఐటీయూసీ)లాంటి యూనియన్లు.. బ్యాంక్‌ల బంద్‌లో పాల్గొననున్నాయి. దాదాపు 2 లక్షల మందికి పైగా ఉద్యోగులు సమ్మెలో పాల్గొనవచ్చనే ఓ అంచనా ఉండగా.. బ్యాంకింగ్ కార్యాకలాపాలపై సమ్మె ప్రభావం తీవ్రంగా ఉండనుంది అంటున్నారు యూనియన్ల నేతలు. అయితే.. బంద్ ప్రభావం తక్కువ స్థాయిలోనే ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెబుతోంది.. ఆర్బీఐ, ఎస్బీఐతో పాటు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు సమ్మెలో పాల్గొనడం లేదని చెబుతున్నారు. దీంతో సమ్మె ప్రభావం పెద్దగా ఉండదనే అంచనాలున్నాయి