HomeTelugu Trendingధనుష్‌ 'సార్‌': బంజారా సాంగ్‌ విడుదల

ధనుష్‌ ‘సార్‌’: బంజారా సాంగ్‌ విడుదల

Banjara Lyrical Song from S
తమిళ స్టార్ హీరో ధనుష్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘సార్’. త‌మిళంలో వాథి టైటిల్‌తో తెరకెక్కుతుంది. టాలీవుడ్ డైరెక్టర్‌ వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్ తాజాగా ఈ చిత్రం నుంచి బంజారా పాటను విడుదల చేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజ్‌ చేసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడగా.. సుద్దాల అశోక్‌ తేజ రాశారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మాస్టారు (తెలుగు వెర్షన్), వావాథి (తమిళంలో) సాంగ్‌ మ్యూజిక్‌ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. సార్‌ చిత్రాన్ని సితార ఎంటర్‌ టైన్‌మెంట్స్‌-ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ శ్రీకర స్టూడియోస్‌ బ్యానర్లపై నాగ‌వంశి, సాయి సౌజ‌న్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో మ‌ల‌యాళ నటి సంయుక్తామీనన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌, తనికెళ్లభరణి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ధనుష్‌ నేరుగా నటిస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. ధనుష్ తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu