HomeTelugu Trendingకీర్తి సురేష్‌ నిర్మాతపై కేసు నమోదు

కీర్తి సురేష్‌ నిర్మాతపై కేసు నమోదు

Banjara Hills police booked

టాలీవుడ్‌లో ఇద్దరు నిర్మాతల మధ్య వివాదం చెలరేగుతోంది. ‘ఐనా నువ్వంటే ఇష్టం’ సినిమా హక్కుల కోసం నిర్మాతలు నట్టి కుమార్‌, చంటి అడ్డాల మధ్య వివాదం ఏర్పడింది. సినిమా హక్కులకు సంబంధించి తనకు రావాల్సిన డబ్బు ఇంకా రాలేదని నిర్మాత నట్టి కుమార్‌పై చంటి అడ్డాల బంజారాహీల్స్‌ పోలీస్ట్‌ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. ఫీల్మ్‌ ఛాంబర్‌లోనూ అతనిపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ‘ఐనా ఇష్టం నువ్వు’ సినిమా తన దగ్గర కొంటానని డబ్బులు ఇవ్వలేదని చెప్పాడు చంటి. చెక్కులు ఇచ్చి, ఇప్పుడే ప్రొసీడ్ అవొద్దన్నాడని… దీంతో ఫిల్మ్ ఛాంబర్‌లో నట్టి కుమార్ మీద ఫిర్యాదు చేశానని చంటి అడ్డాల పేర్కొన్నాడు. మా మధ్య చేసుకున్న అగ్రిమెంట్‌ ను కూడా ఫిల్మ్‌ ఛాంబర్ క్యాన్సిల్ చేసిందని.. అయినా కూడా తన పేరు తీసేసి అతని పేరు పెట్టుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను విడుదల చేసిన పోస్టర్ అతనిదిలా క్రియేట్ చేశాడని… ఛాంబర్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశాకా కూడా తన సినిమాను అతని సినిమాగా చెప్పుకుంటున్నాడని మండిపడ్డాడు చంటి. తాను నట్టి కుమార్ అనే ఫ్రాడ్ ను నమ్మడమే తప్పు అని… పోలీసులు అతనిపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్‌ చేశాడు. ఈ మూవీలో సీనియర్ నటుడు నరేష్‌ తనయుడు నవీన్‌ విజయ కృష్ణ, మహానటి కీర్తి సురేష్‌ జంటగా నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!