డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ‘బంగార్రాజు’ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. చాలాకాలం తరువాత నాగార్జునకి మరో హిట్ దొరికింది. కల్యాణ్ కృష్ణ చాలా తక్కువ సమయంలో ‘పక్కా పండగ సినిమా’ అంటూ ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకుని వచ్చాడు. ఈ సినిమాను గురించి అందరూ మాట్లాడుకునేలాచేశాడు.
ఈ నేపథ్యంలో కల్యాణ్ కృష్ణ తదుపరి సినిమా ఎవరితో .. ఏ బ్యానర్లో ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది. ఆయన తదుపరి సినిమా తమిళ నిర్మాతతో ఉండనుందనే విషయం తాజాగా ఖరారైంది. కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లో జ్ఞానవేల్ రాజా ఒకరు. ఆయన బ్యానర్లో కల్యాణ్ కృష్ణ ఒక సినిమా చేయనున్నాడనే విషయం అధికారికంగా ప్రకటించారు.
ఇక ఈ సినిమాలో హీరో ఎవరు? ఎప్పుడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభమౌతుంది అనే విషయాలను త్వరలోనే వెల్లడించనున్నారు. జ్ఞానవేల్ రాజా ఇంతవరకూ తన స్టూడియో గ్రీన్ బ్యానర్ పై సూర్య .. కార్తిలతో ఎక్కువ సినిమాలు చేస్తూ వచ్చారు.
Happy to Announce, we have collaborated with Telugu Sankranti BLOCK BUSTER #Bangarraju Director @kalyankrishna_k for his next Big venture👍💐💐👍
Other details Soon..@kegvraja #Sankranti #Bangarraju #BlockbusterBangarraju pic.twitter.com/Q45kO6Prm4— Studio Green (@StudioGreen2) January 16, 2022