సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లీడర్ బండ్ల గణేష్‌కు చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ కేసుకు సంబంధించిన విచారణ ఒంగోలు రెండో అదనపు మెజిస్ట్రేట్ కోర్టులో జరిగింది. చెక్ బౌన్స్ కేసు మీద విచారణ అనంతరం ఒంగోలు కోర్టు బండ్ల గణేష్‌కు సంవత్సరం పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
95 లక్షల జరిమానా కూడా విధించింది. 2019లో ముప్పాళ్ళ గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వద్ద బండ్ల గణేష్ 95 లక్షలు తీసుకున్నారు. ఆ తర్వాత ఆ మొత్తానికి పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ పేరుతో చెక్కు ఇచ్చారు. అయితే ఈ చెక్ బౌన్స్ కావటంతో వెంకటేశ్వర్లు కేసు పెట్టారు.
ఈ చెక్ బౌన్స్ కేసుపై ఒంగోలు రెండో అదనపు మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరగ్గా.. విచారణకు బండ్ల గణేష్ సైతం హాజరయ్యారు. అయితే ఈ కేసులో బండ్ల గణేష్‌కు ఏడాది జైలు శిక్ష విధించిన కోర్టు.. 95 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. అయితే కోర్టు తీర్పుపై అప్పీలు చేసుకునేందుకు నెలరోజుల గడువు ఇచ్చింది.