Bandla Ganesh: ఏపీ మంత్రి రోజాపై సినీ నిర్మాత, నటుడు, కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ మరోసారి మండిపడ్డాడు. రోజా ఒక ఐటెమ్ రాణి అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. రేవంత్ ఒక జాక్ పాట్ సీఎం అంటూ రోజా వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆమెకు బండ్ల గణేశ్ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు.
రోజా ఒక డైమండ్ రాణి, ఆమె పని చేస్తున్న పార్టీ నాయకుడు ఒక యాక్సిడెంటల్ సీఎం అని అన్నారు. రేవంత్ ఒక డైనమిక్ లీడర్, ఫైటర్ అని. రోజా చేపల పులుసు వండిపెట్టే పులుసు పాప అన్నారు. రేవంత్ రెడ్డి విమర్మించే రేంజ్ ఆమెది కాదు అని ఫైర్ అయ్యాడు.
ఇదే సమయంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై కూడా బండ్ల గణేశ్ సెటైర్లు వేశారు. కేటీఆర్ మానసిక క్షోభలో ఉన్నారని. పగవాడికి కూడా అలాంటి పరిస్థితి రాకూడదని అన్నారు. కేటీఆర్ చుట్టూ ఈగో వైఫై మాదిరి ఉంటుందని. వచ్చే ఎన్నికల్లో ఏదో సాధిస్తామనే భ్రమల్లో ఉన్నారని చెప్పారు.
రాబోయే రోజుల్లో కేటీఆర్ కు మరిన్ని కష్టాలు తప్పవని జోస్యం చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే 17 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరో కేటీఆర్ చెప్పాలని అన్నారు. ఫోన్ రింగ్ అయినా కేటీఆర్ భయపడిపోతున్నారని చెప్పారు. కేసీఆర్ కొడుకుగానే తప్ప కేటీఆర్ కు మరే గుర్తింపు లేదని అన్నారు.