టాలీవుడ్‌కు తాను పెద్దగా వ్యవహరించాలనుకోవడం లేదంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. తెలుగు సినీ కార్మికులకు హెల్త్ కార్డులు పంపిణీ నిమిత్తం చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఓ కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా చిరు మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ పెద్ద దిక్కు హోదాని సున్నితంగా తిరస్కరించారు. తాను ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండాలనుకోవడం లేదని.. ఆ హోదా తనకస్సలు వద్దని.. బాధ్యత కలిగిన పరిశ్రమ బిడ్డగా అవసరమైన సమయంలో ముందుంటానని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై నిర్మాత, నటుడు బండ్ల గణేష్ స్పందించారు. చిరంజీవి వ్యాఖ్యలను బండ్ల గణేష్ సమర్థించారు. ‘సూపర్ సర్’ అంటూ తన ట్విటర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఆయన మాటలను రిపీట్ చేస్తూ ఈ ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. అయితే ‘మా’ ఎన్నికల తర్వాత సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి.
ఇండస్ట్రీకి సమస్య వున్నా, కార్మికులకు ఏ సమస్యా వున్నా ఎప్పుడు ఆదుకోవడానికి సిద్ధం గా వుంటాను
ఇద్దరు కొట్టుకొని పంచాయితీ చెయ్యమంటే చెయ్యను @KChiruTweets Sir 👌
— BANDLA GANESH. (@ganeshbandla) January 2, 2022