టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ రెండో సారి కరోనా బారిన పడటంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అపోలో ఆసుపత్రిలో ఆయన్ను ఐసీయూలో ఉంచి మరీ చికిత్స అందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి సీరియస్ అయ్యిందని ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో పాటు కాస్త సీరియస్ పరిస్థితి వెళ్లాడంటూ వార్తలు వినిపించాయి.
ఐసీయూలో చికిత్స పొందుతున్న బండ్ల గణేష్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో ఆయన్ను ప్రత్యేక రూమ్ కు మార్చినట్లుగా అపోలో వైధ్యులు చెబుతున్నారు. ఇంకా బండ్ల గణేష్ కరోనాతో బాధపడుతూనే ఉన్నారు. కరోనా ట్రీట్మెంట్ ను బండ్ల గణేష్ కు అందిస్తున్నట్లుగా చెబుతున్నారు. అపోలోలో మరి కొన్ని రోజుల పాటు బండ్ల గణేష్ ఉండాల్సి రావచ్చు అంటున్నారు.