‘మా’ ఎన్నికలు ఉత్కంఠగా మారుతున్నాయి. అద్యక్ష పదవికి పోటీ చేస్తారనుకున్న జీవితా రాజశేఖర్, హేమ .. ప్రకాశ్‌రాజ్ ప్యానల్లో చేరాడం.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా నిర్మాత బండ్ల గణేశ్.. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి తప్పుకొంటున్నట్లు ట్విటర్ వేదికగా ప్రకటించి షాక్‌కు గురి చేశారు. తనను వారి ప్యానెల్ అధికార ప్రతినిధిగా ఎన్నుకొన్నందుకు కృతజ్ఞతలని, కానీ, తన వ్యక్తిగత కారణాలతో ఆ బాధ్యతను నిర్వహించలేనని చెప్పారు. ఆ పదవికి వేరొకరిని ఎన్నుకోవాలని సూచించారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్లోకి జీవిత రావడాన్ని వ్యతిరేకిస్తున్నానని పేర్కొన్నారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి తప్పుకొంటూ ప్రకటన చేసిన కొద్ది సేపటికే ఆయన మరో ట్వీట్ చేశారు.
‘‘మనస్సాక్షికి ఎంత చెప్పినా నా మాట వినడం లేదు. పోటీ చెయ్ అంటోంది. అందుకే పోటీ చేస్తున్నాను. నా మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకుంటాను. ఎవరి మాటా వినను. అందరికీ ఎన్నో అవకాశాలను ఇచ్చారు. నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. మాట తప్పను.. మడమ తిప్పను. నాది ఒకటే మాట.. ఒకటే బాట. నమ్మడం.. నన్ను నమ్మిన వారి కోసం బతకడం’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
మాట తప్పను … మడమ తిప్పను
నాది ఒకటే మాట -ఒకటే బాట
నమ్మడం -నమ్మినవారికోసం బతకడంనా మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకుంటాను –
నేను ఎవరిమాట విననుత్వరలో జరిగే మా ఎన్నికల్లో జనరల్ సెక్రెటరీ గా పోటీ చేస్తాను –
పోటీ చేసి ఘన విజయం సాధిస్తాను…….— BANDLA GANESH. (@ganeshbandla) September 5, 2021
మనస్సాక్షికి ఎంతచెప్పినా మాట వినడం లేదు-నన్ను పోటీ చెయ్ అంటోంది -అందుకే ఈ పోటీ
అందరికీ అవకాశం ఇచ్చారు
ఒకేఒక అవకాశం నాకివ్వండి
నేనేంటో చూపిస్తా …— BANDLA GANESH. (@ganeshbandla) September 5, 2021
నా పరిపాలన ఎంటో తెలియచేస్త
వంద మంది పేద కళాకారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడం నా ధ్యేయం
దానికోసం పోరాడతా… వారి సొంత ఇంటి కల నిజం చేస్తా
ఇప్పుడు పదవుల్లో ఉన్నవాళ్లు రెండేళ్లుగా ఏమి చేయలేదు… ఇప్పుడు చేస్తామంటే మా సభ్యులు నమ్మరు…
— BANDLA GANESH. (@ganeshbandla) September 5, 2021
గొడవలతో మా సభ్యులను మోసం చేసింది చాలు.. ఇక అలా జరగొద్దు
అందరి ఆశీస్సులు కావాలి -మా ను బలో పేతం చేద్దాం
ముఖ్యంగా పేద కళాకారులకు ఇళ్ళ కల నిజం చేద్దాం
అదే మా నిజమైన అభివృద్ది… చిహ్నం
– ఇట్లు మీ
బండ్ల గణేష్— BANDLA GANESH. (@ganeshbandla) September 5, 2021