ప్రపంచవ్యాప్తంగా జరగబోయే ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం మంగళవారం ఢిల్లీలో కర్టెన్ రైజర్
కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంకయ్య నాయుడు, గోవా డెప్యూటీ
సీఎం ఫ్రాన్సిస్ డిసౌజా, ఎంటర్టైన్మెంట్ సొసైటీ ఆఫ్ గోవా అమేయా అభ్యాంకర్ తదితరులు ఈ
కారక్రమంలో పాల్గొన్నారు. నవంబర్ 20 నుండి 30 వరకు గోవాలో జరగబోయే ఈ ఇంటర్నేషనల్
ఫిల్మ్ ఫెస్టివల్ కు ముఖ్య అతిథిగా ఎస్.ఎస్.రాజమౌళి హాజరుకానున్నారు. ఈ ఫిల్మ్ ఫెస్టివలో
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకు సెంటెనరీ అవార్డ్ ను బహూకరించనున్నారు. ఈ ఫెస్టివల్ లో
ప్రప్రాంచవ్యాప్తంగా వివిధ బాషలకు సంబంధించిన సినిమాలు దాదాపు 1032 ఎంట్రీస్ రాగా,
వాటిలో 194 చిత్రాలను ఎంపిక చేసి ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నారు. బెస్ట్ యాక్టర్ మేల్,
ఫిమేల్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఫిల్మ్ ఇలా రకరకాల కేటగిరీలలో ప్రైజెస్ ను డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు.
”ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ ను ప్రోత్సహించే దిశగా ఈ కార్యక్రమాన్ని చెప్పట్టడం మంచి
విషయమని, ప్రభుత్వం తరఫున అందించాల్సిన సహకారం అందిస్తామని” మంత్రి వెంకయ్యనాయుడు
తెలిపారు.