ఇళయరాజా స్వరాలు అందించిన పాటలను పాడొద్దని బాలసుబ్రమణ్యానికి లీగల్ నోటీసులు అందించారు. టాలీవుడ్ లో ఇదొక పెద్ద వివాదానికి దారి తీసింది. ఇళయరాజా అలా చేయకుండా వారి ఆఫీస్ నుండి ఒక్క ఫోన్ కాల్ వచ్చినా.. సరే నేను పాటలు పాడేవాడిని కాదు. అప్పుడు ఇంత వివాదం అయి ఉండేది కాదని ఎస్.పి.బాలు అన్నారు. అంతేకాదు ఎప్పటికీ మేమిద్దరం
అంచి స్నేహితులమే అని.. మేము విడిపోమని స్పష్టం చేశారు.
అయితే ఇంతలోనే ఇళయరాజాకి ఝలక్ ఇచ్చే విధంగా కొన్ని కామెంట్స్ చేశారు. ఓ పాట వెనుక చాలా మంది కష్టం, కృషి ఉంటాయి. అది ఏ ఒక్కరి సొంతం కాదు. దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు, గాయకుడు ఇలా ఇంతమంది కలిసి పని చేస్తేనే.. ఓ పాట సిద్ధమవుతుంది. పాట మీద చాలా మందికి రైట్స్ ఉంటాయని చెప్తూ ఇళయరాజాకి కౌంటర్ ఇచ్చాడు. మరి ఈ విషయంపై ఇళయరాజా ఎలా స్పందిస్తారో.. చూడాలి!