నందమూరి బాలకృష్ణ, పూరిజగన్నాథ్ ల కాంబినేషన్ లో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పోర్చుగల్ లో జరుగుతోంది. ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రియ జంటగా కనిపించనుంది. ఈ సినిమాలో బాలయ్య డాన్ పాత్రలో కనిపించనున్నాడని ఇటీవల పూరిజగన్నాథ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు
ఆ లుక్ కు సంబంధించిన ఫోటో ఒకటి ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైంది. గెడ్డంతో భారీ మేకప్ తో ఉన్న బాలయ్య లుక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తెరపై ఆయన మరింత గొప్పగా కనిపిస్తాడని చిత్రబృందం చెబుతోంది.
ఆ లుక్ కు సంబంధించిన ఫోటో ఒకటి ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైంది. గెడ్డంతో భారీ మేకప్ తో ఉన్న బాలయ్య లుక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తెరపై ఆయన మరింత గొప్పగా కనిపిస్తాడని చిత్రబృందం చెబుతోంది.
యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలయ్య రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నారు. అందులో ఒకటి డాన్ పాత్ర కాగా, మరొకటి టాక్సీ డ్రైవర్ పాత్ర అని తెలుస్తోంది. టాక్సీ డ్రైవర్ లుక్ కు సంబంధించిన స్టిల్స్ ఇదివరకే లీక్ అయ్యాయి. ఇప్పుడు డాన్ లుక్ చూసిన అభిమానులకు సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. దసరా కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.