నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ తరువాత అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే మొదటి నుండి ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు అనే టాక్ నడుస్తోంది.
తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో ఆసక్తికర వార్త వినిపిస్తుంది. ఈ సినిమాలో బాలయ్య రెండు గెటప్స్ లో కాదు.. ఏకంగా మూడు గెటప్స్ లో కనిపించబోతున్నాడట. ముప్పై ఏళ్ల యువకుడి గెటప్ తో పాటు ఏభై ఏళ్ల వ్యక్తిగా.. అలాగే డెబ్బై ఏళ్ల పెద్దాయన గా బాలయ్య కనిపిస్తాడని తెలుస్తోంది.
కథలో భాగంగా ముప్పై ఏళ్ల వయసులో ఆవేశంలో చేసిన గొడవల కారణంగా హీరోకి 14 ఏళ్లు శిక్ష పడుతుందట. అలా జైలు నుంచి ఏభై ఏళ్ల వయసులో విడుదలైన హీరో జీవితంలో చోటు చేసుకునే సంఘటనల ఆధారంగా ఈ సినిమా సాగుతుందట.
తండ్రి కూతురు మధ్య ఓ ఎమోషనల్ ట్రాక్ కూడా ఫుల్ ఎంటర్ టైన్ గా ఉంటుందని తెలుస్తోంది. అలాగే, ప్లాష్ బ్యాక్ చాలా వైల్డ్ గా ఉంటుంది అని అంటున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలకృష్ణ ఈ తరహా సినిమాలు చేయడం కొత్తేం కాదు. ఇప్పటికే చాలా సినిమాల్లో ద్విపాత్రాభినయం కూడా చేశాడు. అయితే అనిల్ రావిపూడితో సినిమా అంటే కొత్తదనం ఉంటుంది అనుకుంటున్న ఈ టైమ్‌లో ఇది కూడా ఈ కోవకు చెందినదే కథే అని వార్తలు రావడం నిరుత్సహం కలిగిస్తుంది.
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు