‘ఎన్టీఆర్’ బయోపిక్ పనుల్లో బిజీబిజీగా ఉన్న నందమూరి బాలకృష్ణ తన భవిష్యత్ ప్రాజెక్టులపై కూడ ఒక కన్నేసే ఉన్నారు. కథల్ని వింటూ నచ్చినవాటికి సైన్ చేస్తున్నారు. ఇప్పటికే తన తర్వాతి సినిమాను బోయపాటి శ్రీనుతో చేయనున్నట్లు ప్రకటించిన ఆయన ఆ తర్వాతి సినిమాను ఒక యువదర్శకుడితో చేస్తారని తెలుస్తోంది. ఆ యువ దర్శకుడు మరెవరో కాదు అనిల్ రావిపూడి. ‘పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్’ సినిమాల్ని చేసి త్వరలో ‘ఎఫ్ 2’తో వస్తున్న అనిల్ కామెడీ ఎంటెర్టైనర్లు రాయడంలో స్పెషలిస్ట్. మరి వీరిద్దరి కాంబినేషన్‌లో ఎంటువంటి చిత్రం వస్తుందో చూడాలి.