నందమూరి బాలకృష్ణ.. డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘అఖండ’. ఈ సినిమాలో విలన్గా శ్రీకాంత్ నటిస్తున్నాడు. అయితే తాజాగా బాలయ్య ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీకాంత్ ను మళ్ళీ విలన్ గా చేయొద్దని సలహా ఇచ్చానని తెలిపారు. బాలయ్య తన 61వ పుట్టినరోజు సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో సినీ రాజకీయాలు.. ఓటీటీలు తదితరుల అంశాలపై మాట్లాడారు. తానెప్పుడూ ఫార్వార్డ్ థింకింగ్ చేస్తుంటానని.. భవిష్యత్ లో ఓటీటీలోకి రావొచ్చేమో చెప్పలేమని బాలయ్య అన్నారు. చిత్ర పరిశ్రమ సొంతమని భావిస్తానని.. సినిమా కోసం ఎందాకైనా వెళ్తానని.. ఇండస్ట్రీలో అందరూ బాగుండాలని కోరుకుంటానని.. అందుకే అందరికీ సలహాలు ఇస్తుంటానని చెప్పారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ ను ఇక విలన్ పాత్రలు చేయొద్దని గట్టిగా చెప్పానని అన్నారు. ”అఖండ లో శ్రీకాంత్ గారు విలన్ గా నటిస్తున్నారు. బ్రదర్ ఇకపై విలన్ పాత్రలు చేయవద్దని గట్టిగా హెచ్చరించాను. నీకు ఆఫర్లు వస్తాయి అని చెప్పాను. అలానే ఒక మంచి సబ్జెక్ట్ ఇచ్చా. ఒక డైరెక్టర్ పేరు కూడా సూచించా. రెండు మూడు సినిమాలు చేసిన తరువాత అతను మళ్ళీ కొన్ని ప్రయోగాలు చేయవచ్చని చెప్పాను. కానీ విలన్ గా మాత్రం చేయవద్దని సలహా ఇచ్చాను” అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.