నందమూరి బాలకృష్ణ మరో వివాదంలో ఇరుకున్న సంగతి తెలిసిందే. కావాలి అని కాకపోయిన.. ఆయన చేసే పలు వ్యాఖ్యలు ఆయనను ఇబ్బందుల్లో పడేస్తున్నాయి. ఇటీవలే అక్కినేని తొక్కినేని అంటూ కామెంట్లు చేయడంతో పెద్ద వివాదం రేగింది. తాజాగా అలాంటి వివాదంలోనే ఇరుకున్నాడు బాలయ్య..
బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్’ షోకి.. పవర్ పవన్ కల్యాణ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈ ఏపిసోడ్ లో బాలయ్య నర్సుల గురించి అసహ్యంగా మాట్లాడారని పెద్ద ఎత్తున దుమారం రేగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే బాలకృష్ణ ఆ మాటలను వెనక్కి తీసుకోవాలంటూ… నర్సుల అందరికీ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై బాలయ్య స్పందించారు.
ఓ లేఖ ద్వారా తాను మాట్లాడిన మాటలపై క్లారిటీ ఇచ్చారు. కావాలనే తనపై కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని… నర్సులను కించపరిచానంటూ చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన మాటలను కావాలనే వక్రీకరించారని వివరించారు. రోగులకు సేవలు అందించే తన సోదరీమణులు అంటే తనకెంతో గౌరవం అని ప్రకటించారు. బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో నర్సుల సేవలను తాను ప్రత్యక్షంగా చూశానని చెప్పుకొచ్చారు. రాత్రింబవళ్లు రోగులకు సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే తనకెంతో గౌరవం అని వివరించారు.
అయితే ఆ నర్సులకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనని వివరించారు. కరోనా వేళ తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతో మంది నర్సులు పగలనక రాత్రనక నిద్రాహారాలు మానేసి కరోనా రోగులకు ఎంతగానో సేవలందించారని స్పష్టం చేశారు. అటువంటి నర్సులను మనం మెచ్చుకొని తీరాలన్నారు. నిజంగా తన మాటలు వారి మనోభావాలను దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని ప్రకటించారు.