టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బోయపాటితో కలిసి హ్యాట్రిక్ మూవీగా త్వరలో ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సింహా, లెజండ్ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రల తరువాత రాబోతున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ల్లో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య జంటగా ఇద్దరు ముద్దుగుమ్మలు నటిస్తారని సమాచరం.
బాలకృష్ణ సరసన నాయన తార, శ్రియ శరన్ నటించే అవకాశం ఉందని తెలుస్తుంది. గతంలో బాలయ్య సరసన సింహా సినిమాలో నయన్ నటించిన విషయం తెలిసిందే. అదే విధంగా శ్రియ కూడా బాలకృష్ణ తో మూడు సినిమాల్లో నటించారు. ఇక ఈ ఇద్దరు భామలతో బాలయ్య సూపర్ హిట్లను అందుకున్నాడు. ఆ సెంటిమెంట్ తోనే బాలకృష్ణ సినిమాకు వీరిని ఎంపిక చేసారట. ఈ కాంబినేషన్ తెరపై కనువిందు చేయడం ఖాయం అని బోయపాటి ధీమాగా ఉన్నారంట.