HomeTelugu Trendingబాలకృష్ణ సరసన బాలీవుడ్ హీరోయిన్..!

బాలకృష్ణ సరసన బాలీవుడ్ హీరోయిన్..!

12 7
టాలీవుడ్‌లో హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే నందమూరి అభిమానులకు పండగే. గతంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్యకు ‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్‌తో మంచి సక్సెస్ అందించాడు బోయపాటి. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘లెజెండ్’ మూవీ కూడా బాలయ్యకు అదిరిపోయే విజయాన్ని అందించింది. ఈ కాంబినేషన్‌లో తాజాగా వస్తోన్న మరో చిత్రం రాబోతుంది. ఈ సినిమా ఇటీవలే ప్రారంభమైంది.

బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. అందులో భాగంగా చిత్రానికి బాలీవుడ్ హంగులు అద్దే ప్రయత్నంలో ఉన్నారు. హీరోయిన్‌గా సొనాక్షి సిన్హాను తీసుకోవాలని భావిస్తున్నారట. అలాగే విలన్ పాత్రకోసం బాలయ్యకు సరితూగే బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్‌ను తీసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం. దీనికోసం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారట. మొత్తంమీద బాలయ్య సినిమాలో బాలీవుడ్ మెరుపులు భారీగా ఉండే అవకాశం ఉంది. తెలుగు సినిమాల్లో హిందీ నటులు నటించడం వలన సినిమా హిందీ డబ్బింగ్, యూట్యూబ్ రైట్స్ కూడా మంచి ధరకు అమ్ముడయ్యే అవకాశం ఉంటుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu