టాలీవుడ్ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇటీవలే ఆయన నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా సక్సెస్ మీట్‌లో చేసిన ‘అక్కినేని తొక్కనేని’ వ్యాఖ్యలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తొలిసారి ఈ వ్యాఖ్యలపై శ్రీ సత్య సాయి జిల్లాలోని హిందుపూరంలో జరిగిన ప్రెస్‌మీట్‌లో బాలకృష్ణ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఎన్నార్, ఎన్టీఆర్ ఇద్దరూ ఇండస్ట్రీకి రెండు కల్లలాంటివారు అని అన్నారు.
నాన్నగారు నేర్పిన క్రమశిక్షణ, బాబాయ్ నుంచి పొగడ్తలకు దూరంగా ఉండడం అన్న విషయాన్ని నేర్చుకున్నా అన్నారు. కొన్ని ఫ్లోలో వచ్చే మాటలను పట్టుకుని నాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే నాకు సంబంధం లేదు అన్నారు. నాగేశ్వరరావు గారు తన పిల్లలకంటే నన్ను ఎక్కువగా ప్రేమించే వారు అన్నారు. నాన్న మరణించిన అనంతరం ఆయన పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు గారికి అందించడం జరిగింది అన్నారు. ఇక (నాగేశ్వరరావు) బాబాయిపై ప్రేమ గుండెల్లో ఉంటుంది. బయట ఏం జరిగినా నేను పట్టించుకోను అని వ్యాఖ్యనించారు బాలకృష్ణ. దీన్నిబట్టి బాలకృష్ణ ‘అక్కినేని తొక్కనేని’ ఉద్దేశ పూర్వకంగా అనలేదు అని స్పష్టం అవుతుంది. ఇప్పటికైనా ఈ వార్తలకు ఫుల్‌స్టాప్ పడుతుందేమో చూడాలి.