HomeTelugu Trendingఅఘోరగా కనిపించనున్న బాలకృష్ణ

అఘోరగా కనిపించనున్న బాలకృష్ణ

2 9
దర్శకుడు బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో సినిమా అంటే ప్రేక్షకులకు పండగే. వీరి కాంబినేషన్‌లో ఇప్పటికే ‘సింహా’ (2010), ‘లెజెండ్‌’ (2014) చిత్రాల మాస్‌ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఇదే కాంబినేషన్‌లో మరో మూవీ రూపు దిద్దుకుంటుంది. ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 26 నుంచి వారణాశిలో జరగనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రెండు డిఫరెంట్‌ షేడ్స్‌లో బాలయ్య కనిపిస్తాడట. ఓ పాత్రలో అఘోరాగా కనిపిస్తారని టాలీవుడ్ టాక్‌.

వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి వుండగా, బాలయ్య న్యూ లుక్ కోసం బోయపాటి వేచి చూడడంతో లేట్‌ అయిందట. ఆలస్యమైనా సినిమా పర్ ఫెక్ట్ గా రావాలని భావిస్తున్నారట. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ అఘోరాగా కనిపించే సన్నివేశాలు అత్యంత కీలకమని సినీ వర్గాల సమాచారం. ఇందులో ఇద్ద‌రు హీరోయిన్‌లని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతానికి శ్రియ‌, న‌య‌న‌తార హీరోయిన్‌లు తీసుకుంటున్నాట్లు ప్ర‌చారం జరుగుతుండ‌గా, దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సిఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu