HomeTelugu Big Stories'ఏసియన్ తారకరామ'ను ప్రారంభించిన బాలకృష్ణ

‘ఏసియన్ తారకరామ’ను ప్రారంభించిన బాలకృష్ణ

Balakrishna opens asian tar
హైదరాబాబ్ కాచిగూడ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న నందమూరి కుటుంబానికి చెందిన తారకరామ థియేటర్ ఆధునిక టెక్నాలజీతో సరికొత్తగా పునర్నిర్మితమైంది. ఏసియన్ సంస్థ ఈ థియేటర్ ను తీసుకుని మరమ్మతులు చేసింది. తారకరామ థియేటర్ ఇప్పుడు ఏసియన్ తారకరామగా మారింది. ఏసియన్ తారకరామను ఈరోజు హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు. ఈ నెల 16 నుంచి ఇందులో సినిమాల ప్రదర్శించబడతాయి. ఈ నెల 16 నుంచి ‘అవతార్ 2’ను ప్రదర్శించనున్నారు. సంక్రాంతికి విడుదల కానున్న బాలయ్య సినిమా ‘వీరసింహా రెడ్డి’ని కూడా ఇందులో ప్రదర్శించనున్నట్టు తెలుస్తోంది.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని మా తల్లి జ్ఞాపకార్థం కట్టాం. ఆ ఆస్పత్రి మాకో దేవాలయం. అలాగే ఈ థియేటర్‌ కూడా మాకు దేవాలయంతో సమానం. అమ్మానాన్నల పేర్లతో ఏర్పాటు చేసిన ఈ థియేటర్‌ను 1978లో ప్రారంభించాం. అక్బర్‌ సలీం అనార్కలి సినిమాతో ఈ థియేటర్‌ ప్రయాణం మొదలైంది. అయితే కొన్ని అనివార్యకారణాల వల్ల నిలిచిపోయిన తారకరామ థియేటర్‌ను 1995లో మళ్లీ ప్రారంభించాం. ఇప్పుడున్న టెక్నాలజీకి అనుగుణంగా సరికొత్త హంగులతో మూడోసారి అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.

ఈ మూవీ థియేటర్‌కు ఓ చరిత్ర ఉంది. తారకరామలో డాన్‌ సినిమా 525 రోజులు ఆడింది. అంతేకాదు నా సినిమాలు కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి. ఈ థియేటర్‌ నాకు సెంటిమెంట్‌. నా కుమారుడు మోక్షజ్ఞ తారక రామ తేజ పేరును నాన్న ఈ థియేటర్‌లోనే పెట్టారు. మాకు ఏషియన్‌ సినిమాస్‌ సంస్థతో మంచి అనుబంధం ఉంది. వారితో కలిసి ఏషియన్‌ తారకరామను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఆనందంగా ఉందన్నాడు బాలకృష్ణ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu