HomeTelugu Big Storiesసీఎం జగన్‌తో భేటీకి రానంటున్న బాలయ్య.!

సీఎం జగన్‌తో భేటీకి రానంటున్న బాలయ్య.!

2 5
ప్రస్తుతం టాలీవుడ్‌లో చిరంజీవి-బాలకృష్ణ మధ్య జరుగుతున్న వివాదం సంగతి తెలిసిందే. షూటింగులు రీ ఓపెన్ విషయమై సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చిరంజీవి సహా సినీ పెద్దలు హాజరై చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ మీటింగ్‌కి తనను పిలవలేదని బాలకృష్ణ మండిపడ్డారు .. భూములు పంచుకుంటున్నారా? అని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

టాలీవుడ్ పెద్దలు తాజా పరిస్థితులపై చర్చించేందుకు ఏపీ సీఎం జగన్‌తో భేటీ అయ్యేందుకు సిద్ధం అవుతున్నారు. జూన్ 9వ తేదీన జరగనున్న ఈ మీటింగ్‌కు బాలకృష్ణను పిలుస్తారా? పిలిస్తే ఆయన వస్తారా? అనే దానిపై అంతా దృష్టి సారించారు. అయితే తాజా సమాచారం జగన్‌తో భేటీకి బాలకృష్ణకు ఆహ్వానించినట్లు తెలుస్తుంది. కానీ బాలయ్య మాత్రం తాను రాలేనని తేల్చిచెబుతూ అందుకు గల కారణాలు వివరించారని నిర్మాత సీ కళ్యాణ్ మీడియాకు చెప్పారు.

సీఎం జగన్‌తో జరగబోయే భేటీకి రావాలని తానే స్వయంగా బాలయ్యకు ఫోన్ చేసి ఆహ్వానించానని, అయితే అదే సమయంలో తన బర్త్ డే సెలబ్రేషన్ పనులు ఉండటంతో ఆయన రాలేనని చెప్పారని నిర్మాత సీ కళ్యాణ్ అన్నారు. తెలుగు చిత్రసీమ రెండు వర్గాలుగా విడిపోయిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఇండస్ట్రీ కోసం బాలకృష్ణ ఎప్పుడూ ముందుంటారని ఆయన పేర్కొన్నారు. ఏపీ సీఎం తో జరగబోయే ఈ భేటీలో దర్శకులు, నిర్మాతలు, పంపిణీ దారులు పాల్గొననున్నట్లు తెలుస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu