HomeTelugu Trendingచిన్నారి అభిమానికి బాలయ్య ఆత్మీయ పరామర్శ

చిన్నారి అభిమానికి బాలయ్య ఆత్మీయ పరామర్శ

5 10

ఇండస్ట్రీలో బిజీగా ఉన్న బాలకృష్ణ ఇటీవల 2014 వ సంవత్సరంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టి హిందూపురం నుంచి పోటీ చేసి విజయం సాధించాడు. 2019లో కూడా బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. బాలయ్యకు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. అలాంటి అభిమానుల్లో ఒకరు స్వప్న. స్వప్న క్యాన్సర్ బారిన పడింది.

క్యాన్సర్ బారిన పడినా కూడా ఆమెకు బాలయ్య అంటే చాల ఇష్టం అంట. హాస్పటిల్ లో ఉంటూ ఆమె మొబైల్ ఫోన్ లో బాలయ్య ఫోటోలు చూస్తూ ఉంటుంది. చనిపోయేలోపు బాలయ్యను చూడాలని అనుకుంది. ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో.. తల్లి దండ్రులు చిన్నారి కోరికను తీర్చేందుకు చాలా కష్టపడ్డారు. చివరకు చిన్నారి కోరిక తీర్చేందుకు బాలయ్య హాస్పిటల్ కు వచ్చాడు. ఆమెతో కాసేపు మాట్లాడాడు. బాలయ్యను చూసిన తరువాత స్వప్న చాలా హ్యాపీగా ఫీలయ్యింది. ఈ ఫొటోలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

5a

Recent Articles English

Gallery

Recent Articles Telugu