HomeTelugu Trendingబాలయ్య కొత్త సినిమా​ పిక్‌.. లీక్​

బాలయ్య కొత్త సినిమా​ పిక్‌.. లీక్​

Balakrishna look leaked fro

‘అఖండ’ సినిమాతో భారీ విజయం అందుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు. శృతిహాసన్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమా బాలకృష్ణకు 107వ చిత్రం. ఇప్పటికే విడుదలైన టీజర్‌‌లో బాలకృష్ణ లుక్ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బుధవారం ఆలంపూరులో కొత్త షెడ్యూల్‌ని మొదలు పెట్టారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. తెల్ల ప్యాంటు, చొక్కాలో ఉన్న బాలయ్య ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఈ షెడ్యూల్లో మరో మూడు రోజుల పాటు యాగంటి, కర్నూల్, ఓర్వకల్లు, పంచలింగాల ప్రాంతాల్లో షూటింగ్‌ చేయబోతున్నారు. ఈ ప్రాంతాలన్నీ ఆధ్యాత్మిక ప్రదేశాలు కావడంతో, దేవాలయాలకి సంబంధించిన అంశాన్ని ఈ సినిమాలో కూడా టచ్ చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ఇక సినిమాని డిసెంబర్‌‌లో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లుక్‌ అభిమానులకు ఎంతగానో ఆకట్టుకుంటుంది.

balakrishna

Recent Articles English

Gallery

Recent Articles Telugu