బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణకు ఇది 107వ సినిమా. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే చాలా వరకు చిత్రీకరణ పూర్తిచేసుకుంది. గ్యాప్ లేకుండా షూటింగ్ జరుపుకుంటోంది. బాలకృష్ణ సరసన హీరోయిన్‌గా శ్రుతి హాసన్ నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.
ఈ సినిమాకు సంబంధించి కొంత పార్ట్‌ను అమెరికాలో షూటింగ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు టర్కీకి ప్లాన్ మార్చినట్లు తెలుస్తోంది. దీనికోసం చిత్రబృందం టర్కీకి పయనమవుతోందట. 2 పాటలతో పాటు కొన్ని సన్నివేశాలు అక్కడ చిత్రీకరించనన్నట్టు తెలుస్తోంది.
తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దసరా లేదా దీపావళికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కుదరకుంటే డిసెంబర్ చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.