నందమూరి బాలకృష్ణ.. చిన్న కూతురు తేజస్విని కొడుకుతో ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య తన మనవళ్ల గురించి అనేక సందర్భాలలో వెల్లడించారు. వారికి నాన్నగారి ఫోటోలు వీడియోలు చూపించి వివరిస్తానని పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. ఈ ఫొటోలో తేజస్విని కుమారుడుని బాలయ్య ఒడిలో కూర్బోబెట్టుకొని ఉన్నాడు. సంప్రదాయ దుస్తుల్లో ఉన్న తాతా మనవళ్లు చిరునవ్వులు చిందిస్తున్నారు. ఇక బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షణ్లో ఓ సినిమా చేస్తున్నాడు. గతంలో వీరి కాంబోలో ఇది 3వ చిత్రం.ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.