నేడు ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తన 60వ పుట్టినరోజు సందర్భంగా.. అభిమానులను ఉద్దేశించి ఫేస్‌బుక్ లైవ్‌లో పలు ఆసక్తికర విషయాలను ముచ్చటించారు. అందరికీ జీవితంలో కొన్ని అద్భుతమైన ఘట్టాలు ఉంటాయి. నా జీవితంలో ఈ రోజు నా 60వ పుట్టినరోజు అంటే షష్టిపూర్తి. అయితే కరోనా కారణంగా నా అభిమానులు, తెలుగు ప్రేక్షకులు మధ్య ఈ వేడుకను జరుపుకోలేనందుకు చాలా బాధగా ఉంది. నాకు సంబంధించిన ప్రతి వేడుకను పండగలా అభిమానులతో కలిసి జరుపుకుంటాను. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. వారికి నాకు మధ్య ఏ అనుబంధం ఉందని.. నన్ను ఇంతలా అభిమానించడానికి.. ఎన్ని డబ్బులు ఇస్తే వారి అభిమానం కొనగలం.. అసలు నా జీవితంలో నేను ఎక్కువ సంపాదించింది ఏమైనా ఉందంటే అభిమానులను మాత్రమే అన్నారు బాలయ్య.
కాగా ఈ రోజు నేను అనుకోని సెలబ్రెటిలు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. అందరికీ ధన్యావాదాలు తెలిపారు బాలయ్య. బోయపాటి ట్రైలర్ గురించి మాట్లాడుతూ .. ఆవేశం అనేది మనకు వెన్నతో పెట్టిన విద్య. ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఇండియాలోనే టాప్ ట్రెండింగ్‌లో ఉంది. సినిమా ఇంకా అద్భుతంగా వస్తుంది. బోయపాటితో నా కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మా మధ్య ఉన్న అండర్‌స్టేండింగ్ అటువంటింది అన్నారు బాలయ్య. ఇక ఆయన పాట గురించి మాట్లాడుతూ.. దీన్ని ఒకఛాలెంజ్‌గా తీసుకున్నాను. నేను ఎందుకు పాడలేను అనే భావంతో పాడాను. అంటే నేనేదో బాగా పాడాను అని కాదు. కానీ ప్రయత్నించాను. అసలు ఇటువంటి సాహసం ఎవరూ చేయరు అన్నారు.
ఇక నా గురువు, గైడ్ అంటూ తన తండ్రి ఎన్టీఆర్ గురించి ప్రస్తావించారు. ఇక లాక్‌డౌన్ తరువాత షూటింగ్ జరుగుతుంది. ఈ విషయంపై సినీ పెద్దలు కూర్చుని చర్చించాలి. సినీకార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక సామాజిక దూరం, మాస్కులు తప్పని సరి. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలోకి ప్రవేశించేటప్పుడు అనుమతి తప్పనిసరి.. ఇక వీలైనంత తొందరగా ఈ చిత్రం మీ ముందుకు తీసుకువస్తాం. అంచనాలకు తగ్గట్లు ఈ చిత్రం ఉంటుంది. ఈ కరోనా టైమ్‌లో కూడా అభిమానులు చేసిన సేవాకార్యక్రమాలకు ధన్యవాదాలు తెలిపారు.