Homeతెలుగు Newsమధిరలో బాలకృష్ణ

మధిరలో బాలకృష్ణ

ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు గ్రామమైన జొన్నల గడ్డ నుంచి అభిమానులు, కార్యకర్తలు వందలాది మోటారు సైకిళ్ల ర్యాలీతో బాలకృష్ణకు ఘనంగా స్వాగతం పలికారు. బాలకృష్ణ వెంట తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ, నామానాగేశ్వరరావు, స్వర్ణకుమారి తదితరులు ఉన్నారు.ముందుగా మండలంలోని రాయపట్నం గ్రామంలోని ఎన్టీఆర్‌, అంబేద్కర్‌ విగ్రహాలకు బాలకృష్ణ పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు.

5

అనంతరం దెందుకూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన భారీ ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మధిర అంబేద్కర్‌ సెంటర్‌, క్లబ్‌ కాంప్లెక్స్‌ కూడలిలోని ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. అనంతరం అభిమానులను ఉద్దేశించి బాలకృష్ణ మాట్లాడారు. తెలుగు జాతి కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచానికి చాటిన మహానీయుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. టీడీపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. తెలంగాణ అభివృద్ధికి ఎన్టీఆర్‌, చంద్రబాబునాయుడు ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎల్‌.రమణ మాట్లాడుతూ అసెంబ్లీపై మహాకూటమి జెండా ఎగురవేయడం ఖాయమని అన్నారు. మహాకూటమి గెలిచే మొదటిస్థానం మధిర నియోజకవర్గమేనని ధీమా వ్యక్తం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu