
Balakrishna betting app controversy:
టాలీవుడ్‌లో ఇటీవల బెట్టింగ్ యాప్ ప్రమోషన్లపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదవుతున్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుఎన్సర్లు, ప్రముఖ నటుల వరకు చాలామందిపై కేసులు నమోదయ్యాయి. తాజాగా నందమూరి బాలకృష్ణ, గోపిచంద్, ప్రభాస్‌లపై ఒక కొత్త ఫిర్యాదు నమోదైంది. ఈ ముగ్గురు టాప్ హీరోలు కలిసి ‘Unstoppable Season 2’లో Fun88 అనే చైనా బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
హైదరాబాద్‌కు చెందిన రామారావు అనే వ్యక్తి ఈ ఫిర్యాదును ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై పోలీసులు విచారణ మొదలు పెట్టారు. అయితే బాలకృష్ణ, గోపిచంద్, ప్రభాస్ ఈ ఆరోపణలపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటులు, సోషల్ మీడియా స్టార్లు విచారణకు హాజరయ్యారు. కొంతమంది లీగల్ నోటీసులు అందుకున్నా, మరికొందరు మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. కానీ బాలకృష్ణ, ప్రభాస్, గోపిచంద్‌లపై కేసు నమోదు కావడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
బాలకృష్ణ ప్రస్తుతం ‘Akhanda 2’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ప్రభాస్ ‘Raja Saab’, ‘Fauji’ సినిమాల షూటింగ్‌లో ఉన్నారు. గోపిచంద్ తాజాగా సంకల్ప్ రెడ్డి డైరెక్షన్‌లో కొత్త సినిమా ప్రకటించారు. ఈ కేసుపై మూడువురు హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలి.