టాలీవుడ్ హీరో బాలకృష్ణపై మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఈయన కామెంట్స్‌తో మరోసారి మెగా నందమూరి కంపౌండ్ల మధ్య ఉన్న వైరం బయటికి వచ్చింది. బయటికి అంతా ఒక్కటే అని చెప్పుకుంటున్నా కూడా లోపల మాత్రం రాజకీయాలు బాగానే నడుస్తున్నాయని మరోసారి తెలిపోయింది. దానికితోడు నీ యిష్టమొచ్చినట్లు మాట్లాడితే ఇక్కడ చూస్తూ కూర్చోడానికి ఎవరూ లేరు.. మీరు కింగ్ కాదు జస్ట్ హీరో అంతే.. ఎవర్ని ఎప్పుడు ఎక్కడికి పిలవాలో అందరికీ తెలుసు అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే ఈయన చేసిన కామెంట్స్ నందమూరి అభిమానులు అస్సలు పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.
పైగా ఇండస్ట్రీలోనే కొందరు నాగబాబుపై సెటైర్లు వేస్తున్నారు. ప్రసన్న కుమార్, నట్టి కుమార్ లాంటి వాళ్లు నాగబాబుపై సీరియస్ అయ్యారు. అసలు బాలయ్య రేంజ్ ఏంటి.. నాగబాబు స్థాయేంటి.. ఆయనొచ్చి ఈయన్ని కామెంట్ చేయడం ఏంటి.. అసలు ఏమైనా బాగుందా ఇది అంటూ నాగబాబుపై ఫైర్ అవుతున్నారు. ఇక బాలయ్య ఫ్యాన్స్ కూడా నాగబాబుని లైట్ తీసుకుంటున్నారు. అనవసరంగా స్పందించి నాగబాబు రేంజ్ పెంచడం తమకు యిష్టం లేదని.. అయినా బాలయ్యను అనే స్థాయి నాగబాబుకు ఎక్కడుంది అంటూ సీరియస్ అవుతున్నారు. దమ్ముంటే సమాధానం చెప్పాలి కానీ ఇలా విమర్శిస్తే ఎలా అంటూ వాళ్లు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు.