టాలీవుడ్ సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి నిన్న గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పై టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన లేని లోటును తీర్చలేమని చిరంజీవి వంటి సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల ప్రధాని మోడీ మరియు ఎందరో రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు.
బాలకృష్ణ కూడా ఆయన మృతిపై స్పందిస్తూ… మంచి ఆత్మీయుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో చిత్రాలలో ఇద్దరం కలిసి నటించామని చెప్పారు. సినీ రంగాన్ని, నాటక రంగాన్ని రెండు కళ్లుగా భావించేవారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఇదే సమయంలో మరో విషయం వినిపిస్తోంది. జయప్రకాశ్ కుటుంబానికి బాలయ్య రూ. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాడు.