టాలీవుడ్ ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
బాలయ్య మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పొలిటికల్‌గా పైకి రావాలంటే అది ఆయన నిర్ణయంపై మీద ఆధారపడి ఉంటుంది. అయితే 2009 ఎన్నికల్లో ఆయన పార్టీ తరుపున ప్రచారం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. సినిమా నటుడిగా ఎన్టీఆర్‌కు మంచి భవిష్యత్తు ఉంది. ఆయన ప్రొఫెషన్ ఒదులకొని పాలిటిక్స్‌లో రమ్మని ఎవరు చెప్పరు. నేను కూడా రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు చేస్తున్నాను. నాన్న ఎన్టీఆర్ కూడా ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో ఉంటూనే కొన్నిసినిమాల్లో నటించారు. ముందుగా మేమందరం సినిమా వాళ్లం. సినిమా తర్వాత రాజకీయాలు. రాజకీయాల్లో రావాలనేది వాళ్ల వాళ్ల నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. మరోవైపు నారా బ్రాహ్మాణి రాజకీయ ప్రవేశంపై స్పందించారు. ఇప్పట్లోనే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం తన కూతురుకు లేదన్నాడు. ఆమెకు ఇష్టం ఉంటే కాదనలేను అంటూ సమాధానమిచ్చారు.