HomeTelugu Trendingఎన్టీఆర్‌తో మల్టీస్టారర్‌కు రెడీ.. కానీ చరిత్రలో నిల్చిపోవాలి: బాలకృష్ణ

ఎన్టీఆర్‌తో మల్టీస్టారర్‌కు రెడీ.. కానీ చరిత్రలో నిల్చిపోవాలి: బాలకృష్ణ

2 7
టాలీవుడ్‌లో నందమూరి ఫ్యామిలీకి మంచి ఫాలోయింగ్ ఉంది. బాలయ్య గురించి ప్రత్యేకించి చెప్పానవసరం లేదు. ఇక జూనియర్‌ ఎన్టీఆర్‌ తనకంటూ స్పెషల్‌గా ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకొని స్టార్‌ హీరో రెంజ్‌కి ఎదిగాడు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌కు మాస్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు వీళ్లిద్దరు ఒకే తెరపై కనిపిస్తే.. అభిమానులుకు పండగే. ఈ నేపథ్యంలో జూన్‌ 10న నందమూరి బాలకృష్ణ 60వ పడిలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా ఈయన ఓ ప్రముఖ తెలుగు దిన పత్రికకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా బాలయ్య తన సినీ, రాజకీయ జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలతో పాటు ఎన్టీఆర్‌తో మల్టీస్టారర్ సినిమా గురించి స్పందించారు.

బాలకృష్ణతో మాట్లాడుతూ… కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌తో కలిసి నటించేందకు తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవనన్నారు. మా ఇమేజ్‌కు తగ్గ కథ సెట్ అయితే తప్పకుండా చేస్తామన్నారు. ఏదో చేయాలంటే చేయాలని కాదు.. కానీ మేమందరం కలిసి చేస్తే అది తెలుగు సినిమా చరిత్రలో గుర్తుండిపోయేలా ఉండే సబ్జెక్ట్ అయితే బాగుంటుంది అని ఆయన అన్నారు.

2a

Recent Articles English

Gallery

Recent Articles Telugu