HomeTelugu Trendingకల్యాణ్‌రామ్‌ '118' సినిమా కోసం వస్తున్న బాలయ్య, తారక్‌

కల్యాణ్‌రామ్‌ ‘118’ సినిమా కోసం వస్తున్న బాలయ్య, తారక్‌

3 25హీరో కల్యాణ్‌రామ్‌ కోసం ఆయన బాబాయి నందమూరి బాలకృష్ణ, సోదరుడు తారక్‌ కలిసి రాబోతున్నారు. కల్యాణ్‌రామ్‌ నటించిన మూవీ ‘118’. కేవీ గుహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. షాలినీ పాండే, నివేదా థామస్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. మహేశ్‌ కొనేరు సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయట. ఫిబ్రవరి 28న అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్‌ షో నిర్వహించబోతున్నారు. నిర్వాణ సినిమాస్ సంస్థ ఈ‌ చిత్రాన్ని విదేశాల్లో విడుదల చేయబోతోంది. మార్చి 1న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

కాగా ఫిబ్రవరి 25న ‘118’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించబోతున్నారు. దీనికి బాలకృష్ణ, తారక్ ముఖ్య‌ అతిథులుగా హాజరు కాబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత మహేశ్‌ కోనేరు ట్విటర్‌ వేదికగా తెలిపారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఈ ప్రచార చిత్రంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu