కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంలో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు జరిపిన చర్చలకు తనని పిలవలేదని బాలయ్య చెప్పిన మాటలు పెను దుమారాన్ని రేపాయి. తాజాగా బాలకృష్ణ.. చిరంజీవిపై పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయింది. ప్రస్తుతం టాలీవుడ్లో చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ వివాదం నడుస్తోంది. తనకు ఎలాంటి సమాచారం లేకుండా తెలుగు ఇండస్ట్రీ వాళ్లు తెలంగాణ ప్రభుత్వంతో జరిపిన చర్చలపై బాలయ్య ఫైర్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు మంత్రి తలసానితో కలిసి భూములు పంచుకోవడానికి మాత్రమే కలిసారంటూ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై మెగా బ్రదర్ నాగాబాబు.. బాలయ్యను నోరు అదుపులో పెట్టుకోమంటూ చెప్పిన మాటలు పెను దుమారన్నే రేపాయి.
ఈ ఇష్యూపై బాలయ్య స్పందించడానికి నిరాకరించారు. మరోవైపు బాలయ్య.. చిరంజీవిపై మరోసారి పరోక్షొగా పంచ్ లు వేసారు. దాసరి నారాయణ రావు తర్వాత ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరిస్తున్న చిరంజీవి పై తనదైన శైలిలో స్పందించారు బాలకృష్ణ. టాలీవుడ్లో దాసరి నారాయణరావు గారిని స్థానాన్ని ఇండస్ట్రీలో ఎవరు భర్తీ చేయలేరంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఈయన వ్యాఖ్యలు చిరంజీవిని ఉద్దేశించి చేసినవే అంటున్నారు. మొత్తానికి దాసరి నారాయణ రావులా ఎవరు ఇండస్ట్రీని ముందుండి నడిపించలేరని బాలయ్య చెప్పడం కొసమెరుపు. మొత్తంగా ఈ ఇష్యూ ఎంత వరకు పోతుందో చూడాలి.