నందమూరి బాలకృష్ణ నిర్మించిన ‘ఎన్టీఆర్’ చిత్రంలో తన తండ్రి ‘ఎన్టీఆర్’ పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన అప్పట్లో ఎన్టీఆర్ చేసిన అనేక పాత్రలు వేషధారణలో కనిపించనున్నాడు. వాటిలో పౌరాణిక, ఇతిహాస పాత్రలు కూడ ఉన్నాయి. వీటికి సంబందించి కొన్ని లుక్స్ ఇప్పటికే బయటకు రాగా ఈరోజు విడుదలైన వేంకటేశ్వర స్వామి వేషధారణ తాలూకు లుక్ బాగా ఆకట్టుకుంటోంది. ఆ గెటప్లో బాలయ్య చాలా కమనీయంగా కనిపిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదలకానుంది.